
స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలి.
పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్10//మక్తల్ //రిపోర్టర్ సి .తిమ్మప్ప//
దేశంలో రోజురోజుకు స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని, మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని, మహిళలకు అసెంబ్లీ, పార్లమెంట్లో వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలని మక్తల్ కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన శ్రామిక మహిళా దినోత్సవ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. దేశాన్ని భారత”మాత”గా భూమిని భూ”మాత”గా దేవతలను దుర్గా”మాత”గా స్త్రీలను పొగడ్తలతో ముంచెత్తడమే తప్ప వారి హక్కుల కొరకు పాలకులు కృషి చేయడం లేదన్నారు. మణిపూర్ లో బాలికల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన ఉన్నావో బాలికని అత్యాచారం, హత్య ఘటన దేశంలో మహిళల దీనస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కేంద్రంలో పరిపాలిస్తున్న ప్రభుత్వం సాంప్రదాయాల పేరుతో మతం పేరుతో మహిళల్ని అనిచి వుంచే ప్రభుత్వం అన్నారు. గతంలో న్యూయార్క్ నగరంలో జరిగిన పోరాట స్ఫూర్తితో వచ్చినటువంటి మార్చి 8 దినాన్ని పోరాట దినంగా మనం పరిగణించి మహిళలంతా ఐక్యంగా తమ హక్కుల కొరకు ఉద్యమించాలన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరాజు అధ్యక్షత వహించి మాట్లాడుతూ మహిళలందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల్ని సాధించుకోవాలని కనీస వేతనాన్ని సాధించుకోవాలని అన్నారు.ఆశ వర్కర్స్ యూనియన్ అమీనా బేగం, సుజాత, ఎస్ పార్వతమ్మ, వెంకటలక్ష్మి, వెంకటమ్మ, గోవిందమ్మ, యశోద, ఇందిరమ్మ, తదితరుల తదితర నాయకులు పాల్గొన్నారు నాయకురాలు ఆర్పీ యూనియన్ నాయకురాలు ఎన్ జ్యోతి గౌడ్ అంగన్వాడి ఎస్ మంజుల నాయకురాలు పాల్గొన్నారు.
