
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 7 అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు మండలంలో ఉన్నటువంటి స్కూల్ శానిటేషన్ వర్కర్ల సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఐటియు చింతూరు మండల ప్రధాన కార్యదర్శి పోడియం లక్ష్మణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్కూల్ శానిటేషన్ వర్కర్లు సమస్యలపరిష్కరించాలి పెండింగ్ వేతనాలు చెల్లించాలి వర్కర్లకు కనీస సౌకర్యాలు కల్పించాలి మాస్కులు గ్లౌజులు షూస్,ఇలాంటి సౌకర్యాలు లేకుండా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం చాలీచాలని వేతనంతో పని చేసుకున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి గానీ కార్మికుల కష్టాలు మాత్రం తీరడం లేదు .ఈ కూటమి ప్రభుత్వం అయినా స్కూల్స్ సానిటేషన్ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలి కనీస వేతనం అమలు చేయాలని అన్నారు. అనంతరం ఈనెల 20న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరుగుతుంది ఈ సమ్మెలో యావత్ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలకు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు.మూడవసారి దేశంలో అధికారంలో వచ్చిన మోడీ కార్మిక చట్టాలను కార్మిక హక్కులను రద్దు చేయాలని చూస్తున్నారు. అలానే కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికుల మీద రుద్దడం సరైనది కాదని అన్నారు. పని గంటలు తగ్గించాలి. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ప్రభుత్వాల నుండి వచ్చే సంక్షేమ పథకాలు కూడా కార్మికులకు అందరికి అందేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో స్కూల్ శానిటేషన్ వర్కర్లు . సురేష్. జయలక్ష్మి. కుమారి. విజయ. రుక్మిణి. లక్ష్మి. తదితరులు పాల్గొన్నారు