
ఇల్లందు డి.ఎస్.పి చంద్రబాను
పయనించే సూర్యుడు టేకులపల్లి రిపోర్టర్ పొనకంటి ఉపేందర్ రావు : శుక్రవారం ఇల్లందు డిఎస్పి ఆధ్వర్యంలో కోయగూడెం ఓసి నందు పనిచేసేటువంటి అధికారులకు మరియు సిబ్బందికి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో డిఎస్పి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో జరిగే దొంగతనాల గురించి, దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించినారు, ఇట్టి కార్యక్రమంలో సీసీ కెమెరాలు యొక్క ప్రాముఖ్యతను, దొంగతనాల గురించి సింగరేణిలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి పలు సూచనలు అందించారు, అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ నేరాలు, రోడ్డు భద్రత మరియు డ్రగ్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ సమావేశంలో ఇల్లందు డిఎస్పి ఎన్ .చంద్రబాను , టేకులపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి సురేష్ , బోడు ఎస్సై పి శ్రీకాంత్, కోయగూడెం ఓసి ప్రాజెక్టు మేనేజర్ సౌరబ్ సుమన్, డిప్యూటీ మేనేజర్ రవికుమార్, అండర్ మేనేజర్ మధుసూదన్, సెక్యూరిటీ ఇన్చార్జ్ అంజిరెడ్డి పాల్గొన్నారు.