
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 బద్వేల్ నియోజకవర్గ ప్రతినిధి ఓ జయ ప్రసాద్
కలసపాడు మండల పరిధిలోని చెన్నారెడ్డి పల్లె లో మంగళవారం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్ పంటలు పండిస్తున్న రైతు ఓబులాపురం రాధా భర్త జయ ప్రసాద్ పొలంలో పకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో 200 లీటర్ల ద్రవ జీవామృతం తయారు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పిడుగుపల్లె క్లస్టర్ యూనిట్ ఇంచార్జ్ జనార్ధన్ మాట్లాడుతూ రైతులు రసాయన పురుగుమందులు వాడి భూమిలో పోషకాలు నశించి భూమి సారవంతం తగ్గుతుందని అందువల్ల ప్రతి ఒక్కరు రసాయన మందులు వదిలిపెట్టి పకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఘనజీవామృతం ద్రవ జీవామృతం వేసుకుంటే మంచి దిగుబడి వస్తుందని తెలియజేశారు అనంతరం భూమిలో రెక్కల పురుగులు నివారించుటకు పసుపు పల్లెలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఐ సి ఆర్ పి మధుసూదన్ తిరుపాల్ నారాయణమ్మ లు పాల్గొన్నారు
