
షాద్ నగర్ మార్కెట్ యార్డ్ నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
మంగళవారం షాద్ నగర్ మార్కెట్ యార్డ్ లో కొందుర్గ్ ప్రాధమిక సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే క్రయించాలని,రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్‌కు రూ. 2320, కామన్ రకానికి రూ.2300 ధర చెల్లిస్తుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్,కొందుర్గ్ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, ఫరూఖ్ నగర్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ బక్కన్న యాదవ్,కొందుర్గ్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ దామోదర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మల్లేష్, కరుణాకర్ భాస్కర్ నవీన్, భరత్,రవినాయక్,మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి,అగ్గనూర్ బస్వo, ఇబ్రహీం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజు గౌడ్,సుదర్శన్ గౌడ్, హరినాథ్ రెడ్డి,నర్సింహులు, కుమారస్వామి గౌడ్,చంద్రశేఖర్, పురుషోత్తం రెడ్డి,శ్రీనివాస్, కుమారస్వామి గౌడ్,కొమ్ము కృష్ణ, మహబూబ్ షరిఫ్,రఘునందన్ సుదర్శన్,అనిల్,గంగనమోని సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు.
