
పయనించే సూర్యుడు మే 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి సందర్బంగా మండల కేంద్రం చేజర్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో, ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు & కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక బస్టాండ్ సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కడపలో జరుగుతున్న రెండవ రోజు మహానాడు కి తరలివెళ్లిన చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు