
జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేతో కలిసి వినతి పత్రం ఇచ్చిన నందిగామ మండల నాయకులు
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
మండల కేంద్రమైన నందిగామలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి కి సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి స్థానిక మండల నాయకులు వినతి పత్రం అందజేశారు. కొత్తగా మండలం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా నందిగామలో గ్రంధాలయ ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ను కలిసిన వారిలో మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, చంద్రపాల్ రెడ్డి, దేపల్లె కుమార్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగ నరసింహులు, చించేటి కృష్ణ గౌడ్, తడకల జంగయ్య స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.