
పయనించే సూర్యుడు అక్టోబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆటోనగర్ ప్రాంతాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం
నంద్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అందులో భాగంగా నేడు నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆటోనగర్ ప్రాంతాలలో మొత్తం రూ. 75 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ శాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ మాట్లాడుతూ స్థానిక ప్రజల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే దిశగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు మంత్రి ఫరూక్ తెలియజేశారు. ముఖ్యంగా పట్టణంలోని మూడు ముఖ్యమైన ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సాధించామన్నారు.భూమి పూజ చేసిన పనుల వివరాలు:కుందు బిర్జి నుంచి పెట్రోల్ బంక్ వరకు ప్యాచ్ వర్క్ రూ. 20 లక్షల వ్యయంతో కుందు బిర్జి నుండి పెట్రోల్ బంక్ వరకు రోడ్డు ప్యాచ్ వర్క్ పనులకు భూమి పూజ జరిగిందని. ఈ ప్యాచ్ వర్క్ పూర్తయితే ఆ మార్గంలో రాకపోకలు సులభతరం అవుతాయన్నారు “వైఎస్ఆర్ నగర్ నివాసితులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు రూ. 15 లక్షల అంచనా వ్యయంతో సిసి (సిమెంట్ కాంక్రీట్) రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించామన్నారు. ఈ సిసి రోడ్డు వర్షాకాలంలో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగిస్తుందన్నారు.”ఆటో నగర్ ప్రాంతంలో రూ. 40 లక్షల వ్యయంతో గ్రావెల్ రోడ్డు ఏర్పాటుకు భూమి పూజ చేశామని . ఈ గ్రావెల్ రోడ్డు ఏర్పాటుతో ఆటోనగర్‌లోని రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు.మొత్తంగా రూ. 75 లక్షలతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఆటోనగర్ ప్రాంతాల రూపురేఖలను మార్చడంతో పాటు, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని మంత్రి ఫరూక్ తెలిపారు . అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో 38 వార్డు టిడిపి ఇన్చార్జ్ తాటికొండ బుగ్గ రాముడు , మహేష్, గోవిందు నాయుడు , మరాఠీ సూరి , కామిని మల్లికార్జున, షేక్ మున్న , నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఈ గుర్రప్ప, పిడి వెంకట దాస్, కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్, నంద్యాల లీగల్ సెల్ జిల్లా మాజీ అధ్యక్షులు నందం బాబురావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు


