▪ గ్రామ ప్రజలంతా భయాందోళనలకు గురి..
దొంగలు .అనుకొని పోలీస్ స్టేషన్కు సమాచారం..
▪ అ మాజీ సర్పంచ్ తో నాకు ప్రాణం భయం ఉంది సోహెల్. ఆడియో కలకలం..
పయనించే సూర్యడు //జనవరి //27//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామనికి.. చెందిన మాజీ సర్పంచ్, అర్ధరాత్రి 11 12 గంటల ప్రాంతంలో బిజిగిరి పక్కన ఉన్న ( ముళ్లపల్లె ) అనే గ్రామంలో అర్ధరాత్రి అడవి ప్రాంతంలో మరియు అతని కారు, ఉండేసరికి ఈ టైం లో కారు ఇక్కడ ఉంది ఏంటి అని గ్రామస్తులు బయందనలకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం.. అర్ధరాత్రి గ్రామానికి పక్కన చెట్ల పొదల్లో కారి ఆగి ఉండడం చూశామన్నారు. గ్రామస్తులు భయాందోళనకు గురై దొంగలు కావచ్చు అనుకొని, ఊరు గ్రామ ప్రజలు అందరూ కలిసి అక్కడికి వెళ్లి చూడగా, కోరపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మధుసూదన్, అక్కడ ఉన్నాడు అని తెలిపారు. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడగగా.. వేరే పని మీద వచ్చాను అని, నాకు సిమెంట్ బస్తాల గోధుమ్ ఉంది, అని వేరే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు అని తెలిసి వాళ్లతో మాట్లాడదామని, వచ్చాను అని అన్నారు అని తెలిపారు.
కానీ అదే గ్రామానికి చెందిన సోహెల్.. గతంలో తన మీద కక్షపూరితమైన కేసులు పెట్టించాడు మధుసూదనని తెలిపారు. నా ఇంటి వెనకాల ఉన్న చెట్ల పొదల్లో అతని కారు ఉండడం వల్ల దొంగలు కావచ్చు అని నేను గ్రామస్తులకు తెలియజేయడమైనది అని తెలిపారు. కాగా ఎవరు అని చెప్పి మేము నలుగురం వెళ్లేసరికి అక్కడ ఉన్న కొందరు కత్తులు తీయండి నరికేద్దాం అని వాన్ని అనడం జరిగింది అని వివరించారు. అంతలోపే గ్రామస్తులు అందరూ చేరుకోగా, గతంలో కేసు పెట్టిన ఇతనే మళ్లీ అక్కడ ఉన్నందున నన్ను చంపేందుకే వచ్చారు అని సోహెల్ అన్నారు.. గతంలో ఇతని వల్ల మా నాన్న చనిపోయాడని, ఇప్పుడు నన్ను కూడా చంపే ప్రయత్నం చేస్తున్నారని, వివరించారు. పని మీద వచ్చిన వ్యక్తి సిసి రోడ్డు మీద నుంచి వచ్చి వెళ్లాలి తప్ప, కారును చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి, అక్కడ లైట్స్ ఆఫ్ చేసుకుని, నా ఇంటి వెనుక భాగంలో ఉండడం, తగు అనుమానాలకు దారితీస్తుందని వివరించారు. ఇతని వాళ్ళ కొన్ని కుటుంబాలు నష్ట పోయాయాని వివరించారు. పేరుకు పెద్ద మనిషి, చేసేటివి చిల్లర పనులు అని తెలిపారు.ఇంతలోనే గ్రామస్తులు 100కు డయల్ చేసి, వివరణ తెలుపగా, జమ్మికుంట పోలీస్ వారు వచ్చి, మాజీ సర్పంచ్ మధును,అక్కడ నుండి తీసుకెళ్లడం జరిగిందని, రేపు ఉదయం పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వగలరని పోలీసులు అన్నారని, గ్రామస్తులు తెలియజేశారు. కానీ అతని వల్ల నాకు ప్రాణభయం ఉందని సోహెల్ అన్నారు.