
( పయనించే సూర్యుడు మార్చి 25 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
ఈరోజు షాద్ నగర్ పట్టణంలో రంగారెడ్డి జిల్లా బీసీ సేన ఆధ్వర్యంలో మాదిగల హక్కుల కోసం అనేక సంవత్సరాలుగా నిరంతరంగా పోరాటం చేసిన తుప్పు నర్సన్న , అంజక్క ని ఘనంగా సన్మానించబడారు. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి తమ జీవితాన్ని అంకితం చేసి, దండోరా ఉద్యమం నుండి నేటివరకు సామాజిక న్యాయ పోరాటాల్లో నర్సన్న, అంజక్క గార్లు పోషించిన కీలక భూమికకు గుర్తింపుగా ఈ సన్మానం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ గారు హాజరై, వీరి సేవలను కొనియాడుతూ, న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి బీసీ సేన అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీసీ వర్గాల ఐక్యత మరియు హక్కుల సాధన కోసం కృషి చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.ప్రత్యేక అతిథులుగా బీసీ సేన అసెంబ్లీ అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అప్పా గారు, మహిళా అసెంబ్లీ అధ్యక్షులు వరలక్ష్మి గారు పాల్గొని నర్సన్న, అంజక్క గార్లను సన్మానించి, వారి త్యాగాన్ని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో బీసీ సేన నాయకులు కుర్మన్న, శివ తదితరులు పాల్గొన్నారు. బీసీ వర్గాలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు, సామాజిక న్యాయ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నేతలు ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. బీసీ హక్కుల కోసం అందరూ సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.