
: నర్సరీని పరిశీలిస్తున్న డిఎల్ పిఓ నాగరాజు…
రుద్రూర్, జూలై 16 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో డిఎల్ పి ఓ నాగరాజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో గల నర్సరీ డంపింగ్ యార్డ్ లను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేశారు. గ్రామ వివరాలు, పాఠశాల, అంగన్వాడి కేంద్రాలు, తాగునీటి, పారిశుధ్యం వివరాలను పంచాయతీ కార్యదర్శి మోహన్, కారోబార్ అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలును వివరాలు అడిగి తెలుసుకున్నారు.