
పయనించే సూర్యుడు న్యూస్ :అక్టోబర్ నెలలో మిశ్రమ ఫలితాలను చవిచూసిన టాలీవుడ్, నవంబర్ క్యాలెండర్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. రాబోయే వారాల్లో పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు సంబంధిత హీరోలు, హీరోయిన్ల కెరీర్‌కు కీలకం కానున్నందున, ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు ఆ మూవీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ తొలి వారంలో రష్మిక మందాన నటించిన ది గర్ల్‌ఫ్రెండ్, సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా నటించిన జటాధర సినిమాలు పోటీ పడనున్నాయి. రష్మిక తొలి లేడీ ఓరియంటెడ్ సౌత్ చిత్రంగా ది గర్ల్‌ఫ్రెండ్ మంచి బజ్ క్రియేట్ చేసింది.