ప్రయనించే సూర్యుడు పెద్దవూర మండలం ప్రతినిధి.జనవరి 26:- నాగార్జునసాగర్ డ్యాం ఎస్ పి ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఆర్ఐ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు సూపర్డెంట్ ఇంజనీర్ శ్రీధర్ రావు పాల్గొన్నారు, ముందుగా మహాత్మ గాంధీజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,చిత్రపటానికి పూలమాల లేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు,ఈ సందర్భంగా ఎస్ పి ఎఫ్ ఆర్ఐ శ్రీనివాసరావు,వారి సిబ్బంది సేవలు అభినందనీయమని ఆయన కొనియాడారు, అనంతరం గణతంత్ర దినోత్సవం విశిష్టతను వివరించారు,ఈ సందర్భంగా ప్రాజెక్టు సూపర్డెంట్ ఇంజనీరింర్ శ్రీధర్ రావు మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని పెంచేలా ప్రతి ఉద్యోగులు కృషి చేయాలన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించిన హక్కులను మానవ విలువలను కాపాడాలని ఆయన అన్నారు,ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్ పి ఎఫ్ ఆర్ఐ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఏ దేశంలోని లేని రాజ్యాంగాన్ని మన దేశంలో రాజ్యాంగాన్ని సృష్టికర్త దేశ గర్వపడేలా రాజ్యాంగ సృష్టించిన గొప్ప మహనీయులు బిఆర్ అంబేద్కర్ అని అన్నారు,ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు, ఎస్పీఎఫ్ ఎస్సై రఘుబాబు,ఏ ఎస్ఐ లు,పుల్లయ్య, మహమూద్,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.