Monday, January 27, 2025
Homeతెలంగాణనాగార్జునసాగర్ లో ప్రభుత్వ ప్రవేట్ కార్యాలయలో ఘనంగా 76 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

నాగార్జునసాగర్ లో ప్రభుత్వ ప్రవేట్ కార్యాలయలో ఘనంగా 76 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

Listen to this article

ప్రయాణించి సూర్యుడు పెద్దవూర మండల ప్రతినిధి జనవరి 26 నాగార్జునసాగర్ లో ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయంలో, ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు నిర్వహించారు,ఈ సందర్భంగా విజయ పూరి టౌన్ పోలీస్ స్టేషన్ లో గణతంత్ర వేడుకలు,నాగార్జునసాగర్ సర్కిల్ సీఐ బీసన్న ఆధ్వర్యంలో నిర్వహించారు, ముందుగా జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం గణతంత్ర దినోత్సవం విశిష్టతను వివరించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రాసిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బ్రిటీష్ రాజ్యం నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అందుకే భారతీయ పౌరులు ప్రతి ఒక్కరు జనవరి 26న భారత రాజ్యాంగ దినోత్సవం గా గౌరవించాలని ఆయన అన్నారు,అనంతరం ఎస్సై సంపత్ గౌడ్ మాట్లాడుతూ దేశ పౌరులు గౌరవించదగ్గ రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం అని అన్నారు వందమంది క్రిమినల్ తప్పించుకొని పోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని మన రాజ్యాంగంలో పొందుపరిచిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకట్ రెడ్డి కానిస్టేబుల్ శంకర్ కోటి కిరణ్ నరసింహ వెంకటస్వామి శంకర్ ఉస్మాన్ దౌలత్ ఖాన్ రామ్మోహన్ ప్రభు తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments