Wednesday, October 22, 2025
Homeఆంధ్రప్రదేశ్నాయుడుపేట పరిసరాల గ్రామాల్లో ప్రచార రథంతో * హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

నాయుడుపేట పరిసరాల గ్రామాల్లో ప్రచార రథంతో * హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

Listen to this article

పయనించి సూర్యుడు అక్టోబర్ 8 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం లో భాగంగా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు “సమగ్ర ఆరోగ్య ప్రచార రథం” ద్వారా నిర్వహించారు. నాయుడుపేట మండలం లోని ” తుమ్మూరు, తిమ్మాజికండ్రిగ గ్రామాలలో మరియు నాయుడుపేట లోని రైల్వేస్టేషన్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ కె. బాలాజి మాట్లాడుతూ “సమగ్ర ఆరోగ్య ప్రచార రథం” ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాప్తి కారకాలు, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ లక‌్షణాలు, అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి, డ్రగ్స్ వాడకం వలన కలిగే ఇబ్బందులు, కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017, ఎ.ఆర్.టి మందులు, ఏ.పి.శాక్స్ యాప్ ,టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి తెలుపుతున్నామని, మీ ద్వారా తెలియని వాళ్లకు తెలియజేయమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటిలో ప్రాజెక్టు మేనేజర్ కె. బాలాజి, ఓ.ఆర్.డబ్ల్యూలు యమ్. సాయి లక్ష్మి , టి. శ్రావణి, పి.ఇ లు మరియు 350 మంది ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments