
పయనించే సూర్యుడు న్యూస్ మే 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
చత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ జిల్లాలో భద్రత దళాలు మావోయిస్టు ల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది, ఇందులో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరి కొంతమందికి గాయాలైనట్లు తెలిసింది. దీంతో ఆపరేషన్ కగార్ తో ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న మావో యిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తుంది..ఇవాళ ఉదయం నుండి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో జరుగుతోన్న భీకర ఎదురుకాల్పుల్లో సుమారు 20మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. అబూజ్‌మడ్ అడవులు, నారాయణ పూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లాల పరిధిలో మావో యిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు రంగంలోకి దిగిన డీఆర్జీ జవాన్లు ఇవాళ తెల్లవారు జాము నుంచే కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే, నారాయణపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో వారికి పెద్ద సంఖ్యలో మావోయిస్టుల ఎదురు పడగా.. ఇరువర్గాల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ క్రమంలోనే డీఆర్జీ జవాన్లు మావోయిస్ట్ అగ్రనేతలను చుట్టుము ట్టినట్లుగా తెలుస్తోంది. జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 25 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమి కంగా సమాచారం అందు తోంది. అయితే, డీఆర్జీ జవాన్లకు మావోయిస్టులకు మధ్య తగ్గేదే లేదు అన్న ట్లుగా ఇవ్వాళ ఉదయం నుంచి భద్రత దళాలకు మావోయిస్టులకు హోరా హోరీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.