
జిల్లా కలెక్టర్ కి అంబేద్కర్ యువజన సంఘం,మక్తల్ వినతి అందజేత
//పయనించే సూర్యుడు// జులై 5//మక్తల్
అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ ఆధ్వర్యంలో అధ్యక్షులు పృథ్వీరాజ్ నారాయపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్బంగా అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత విద్యార్థులకు నాణ్యమైన కార్పొరేట్ విద్యను అందిన్చే బెస్ట్ అవలెబుల్ ఉచిత విద్యా పథకం కింద చదువుతున్న విద్యార్థుల గత 3 సంవత్సరాల మొండి బకాయి 200 కోట్ల వరకు ఉన్నాయని…ఈ క్రమంలోనే మన నారాయణపేట జిల్లా పరిధిలో 2కోట్ల రూపాయల బెస్ట్ అవెలబుల్ స్కూళ్ల మొండి బకాయిలున్న కారణంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు దాటుతున్న పిల్లలను చాలా పాఠశాలలో చేర్చుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా నాయకులు తల్వర్ నరేష్ గారు మాట్లాడుతూ వెంటనే మన జిల్లా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యొక్క 2 కోట్ల పెండింగ్ ఫిజు బకాయిలను చెల్లించి ప్రవెట్ పాఠశాల యాజమానుల వేధింపుల నుండి తల్లిదండ్రులను, పిల్లలను కాపాడాలని ,వారి చదువులు సాఫిగా కొనసాగేలా చూడాలని కోరారు. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ అధ్యక్షులు పృథ్వీరాజ్, తల్వార్ నరేష్, తేజ తదితరులు పాల్గొన్నారు.
