
{పయనించే సూర్యుడు} {నవంబర్ 5} మక్తల్
ఈరోజు మక్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ చేరికలు నిర్వహించడం జరిందింది. తెలంగాణ జనసేన పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్దాంతాలు నచ్చి నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో పార్టీలో వివిధ గ్రామాలకు చెందిన యువకులు జనసేన పార్టీ కోసం తమవంతుగా కొడంగల్ నియోజకవర్గం లో కూడా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని జనసేన పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన వారు
ఆంజనేయులు ,అజయ్ కుమార్, గుండురాజ్, సదానంద్, నరేష్, పరమేశ్, రాఘవులు, అంజి, నాగేష్, రమేష్, చిన్న, కృష్ణ, శివరాజ్, రాజ్ తదితరులు.డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం ప్రజా సమస్యల కోసం ప్రశ్నించడం కోసం ఎంత దూరమైన వస్తాం అని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మక్తల్ నియోజవర్గ ముఖ్య నాయకులు గౌడి బాల్ రెడ్డి, శివ ప్రసాద్, భీమేష్ ముదిరాజ్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

