
పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఇంచార్జ్ వడ్ల శ్రీనివాస్ 20 తేదీ మార్చి
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో నారాయణ పేట – కొడంగల్ ఎత్తిపోతలకు నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారని జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్.నర్సింహా ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన ఈ ఎత్తిపోతలకు నిధులు ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజసం అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు ఇస్తాం అని చెప్పి నిధులు కేటాయించకుండా ఎలా పూర్తి చేస్తారో సంబంధిత అధికారులు,మంత్రులు తెలుపాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఉన్నపుడు రాష్ట్ర బడ్జెట్ మొత్తం కాళేశ్వరంకు ఖర్చు చేసి సంవత్సరంలో పూర్తి చేశారని తెలిపారు.ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కొందరు అడ్డుపడడం మంచిది కాదు అని అన్నారు.కాంగ్రెస్ పెద్దలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో అత్యధికంగా కాంగ్రెస్ ఎంఎల్ఏలను గెలిపించిన విషయాన్ని గుర్తు పెట్టుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారు.సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ప్రతి బడ్జెట్ సమావేశంలో కేటాయించి తొందరగా పూర్తి చేయాలని కోరారు