
- హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
పయనించే సూర్యడు // మార్చ్ // 12 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ… తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు. “బీఆర్ఎస్ నా కుటుంబం… కెసిఆర్ నా నాయకుడు. ఎప్పటికీ అదే పార్టీ, అదే నాయకుడి వెంట ఉంటానాని బీఆర్ఎస్ కి నాకు వున్న అనుబంధాన్ని ఎవరూ తెంచలేరని ” అని ధ్వజమెత్తారు. కొంతమంది నా ప్రజాదరణను చూసి ఓర్వలేక… కాంగ్రెస్ పార్టీకి వున్న చేతగాని పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ నా రాజకీయం, నా నమ్మకం, నా జీవితం అంతా బీఆర్ఎస్ పార్టీకి అంకితం!అని తెలిపారు. అధికారంలో వున్నా, లేకపోయినా… కెసిఆర్ తోనే ఉంటా!” అని స్పష్టం చేశారు.తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు, అలాగే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరించారు. “బీఆర్ఎస్ కుటుంబ సభ్యులెవ్వరూ ఇలాంటి అబద్ధాలను నమ్మొద్దు అని వీటిని ధీటుగా తిప్పికొట్టాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం” అని కౌశిక్ రెడ్డి ధీమాగా చెప్పారు.