
నిర్భందాన్ని ప్రయోగిస్తూ అక్రమ అరెస్టులు చేస్తే ఊరుకునేది లేదు..
వేలం వేస్తున్న భూములలో జేసీబీలను, బుల్డోజర్లను వెనక్కి పంపాలి..
పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ డిమాండ్..
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 1 //కుమార్ యాదవ్ ( హుజురాబాద్)..
పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలోని గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేసిందని, నియంతృత్వాన్ని, అహంకారాన్ని ప్రదర్శించిందని ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అంతకంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో నిర్భందాన్ని , అహంకారన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. దానిలో భాగంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీకి చెందిన 400 ఎకరాల భూములని కర్పొరేట్ సంస్థలకు వేలం వేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు.ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత పది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా, ఈ ఆందోళనలు చేస్తున్న విద్యార్థుల పట్ల అలాగే యూనివర్సీటీ భూములు తీసుకోవద్దని డిమాండ్ చేస్తున్న, సమాజం పట్ల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మత్రి శ్రీధర్ బాబు అత్యంత దురుత్సాహకరమైన రీతిలో వ్యవహరించి వాఖ్యలు చేశారన్నారు. ఆ నాలుగు వందల ఎకరాలలో ఏమీ లేదని నిరూపించుకోవటం కోసం అక్కడున్న ఫారెస్టును తొలగించి భూములన్నింటినీ హద్దులు లేకుండా చెరిపివేయాలే పేరుతో జీవవైవిద్యాన్ని దెబ్బతీసేందుకు, మొక్కలను తొలగించటం కోసం జేసీబీలను బుల్డోజర్లను,తీసుకుని వచ్చారన్నారు. పోలీసు బలగాలను దింపి, బారీగేట్లను ఏర్పాటు చేయటంతో విద్యార్థులు తమ భూములను కాపాడుకోవటం కోసం ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి సుమారు 60 మందికి పైగా రాయ్‌దుర్గ్, మాధాపూర్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లకు తరలించారన్నారు. వారితో పాటు మరో 200 మందిని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇది అత్యంత అవమానకరమైన ఘటన అని మండిపడ్డారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ఎవరైనా వచ్చి ముఖ్యమత్రిని కలసి సమస్యలు చెప్పుకోవచ్చని అసెంబ్లీలో ప్రకటించిన రేవంత్ రెడ్డి, విద్యార్థులని చూడకుండా అమ్మాయిలని చూడకుండా, జుట్టు పట్టి మరి, గాయాలు చేసి, లాక్కుని పోయి, నిర్బందాన్ని ప్రయోగిసూ పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ వ్యాన్లలో ఎత్తేవేస్తూ అరెస్టు చేయటాన్ని, పి డి ఎస్ యు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు.ప్రజాస్వామ్యం లేకుండా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుందఅని, తక్షణమే ఈ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు.యూనివర్సీటీలో దింపిన పోలీస్ బలగాలను వెనక్కి పిలిపించాలని, జేసీబీ, బుల్డోజర్లను అక్కడి నుండి ఖాళీ చేయించాలని, హెచ్‌సీయూకు చెందిన భూముల వేలాన్ని అపాలని , పి డి ఎస్ యు, రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసిన భూముల సర్కులర్ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో విద్యార్థుల తరపున ముఖ్యమత్రి ఇంటిని కూడా ముట్టడిస్తామని ఈ హెచ్చరిoచారు. ఈ ఘటనలనీ, నిర్బంధాలనీ, నియంతృత్వాన్ని ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు ఖండించాలని పి డి ఎస్ యు జిల్లా కమిటి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లోకిని రమేష్ , రాజేష్, దేవేందర్ పిడిఎస్యు నాయకులు తదితరులు పాల్గొన్నారు.