
పయనించే సూర్యుడు న్యూస్ :రామగిరి,సెంటినరీ కాలనీ – ఐ ఎన్ టి యు సి సెంట్రల్ సెక్రటరీగా ఆర్జీ 3 ఇన్చార్జిగా ఉడుత శంకర్ యాదవ్ నియామకమయ్యారు. గోదావరి ఖనిలోని జనక్ భవన్ లో మంగళవారం ఐ ఎన్ టి యు సి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ,,సింగరేణి కోల్ మైన్స్ కాంటాక్ట్ వర్కర్స్ అండ్ ఔట్సోర్సింగ్ లేబర్ యూనియన్ ఆర్ జి -3 వైస్ ప్రెసిడెంట్ రెండు సంవత్సరాలు యూనియన్ కు కట్టుబడి ఆర్ జి -3ఏరియాలో అవినీతి లేకుండా చేసి కాంట్రాక్ట్ కార్మికులకి అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కారం చేస్తూ పనిచేయడంతో యూనియన్ నా సేవలను గుర్తించి సెంట్రల్ సెక్రెటరీ,ఆర్ జి త్రీ ఇన్చార్జి,గా అవకాశం కల్పించినందుకు ఐ ఎన్ టి యు సి కనీస వేతన సలహా మండలి జనక్ ప్రసాద్ కు జాతీయ అధ్యక్షుడు సంజీవ రెడ్డి కి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు ధన్యవాదాలు తెలిపారు. వారి ఆలోచన మేరకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు.