
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం
ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా చివరి రోజు విజయదశమి రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శమివ్వనున్నారు. విజయదశమి తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద పండుగ. ఉత్తర భారతంలో కూడా దుర్గా పూజ పేరుతో నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా విజయదశమి ఎందుకు జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న గాధ ఏమిటి అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.విజయదశమి పండుగ వెనుక ఓ గాథఅపరాజితా దేవి అవతరించిన రోజు విజయదశమి. అపరాజితా దేవి అంటే పరాజయమన్నది ఎరుగని దేవత. త్రిశక్తి స్వరూపమైన ఈ దేవిని పూజిస్తే పరాజయమన్నదే ఉండదు. అమ్మవారు మధు, కైటభులను రాక్షసులను సంహరించి ప్రజలకు సుఖఃశాంతులను అందించినది కూడా ఈ రోజే!విజయాలకు నాంది విజయదశమివిజయదశమి సర్వ విజయాలకు నాంది. ఈ రోజు ఏ పనిని ప్రారంభించినా విజయం తధ్యం. విజయదశమి రోజునే శ్రీరాముడు లోకకంటకుడైన రావణ సంహారం చేసాడు. అందుకే ఈ రోజు ప్రజలు శ్రీరాముని విజయానికి సంకేతంగా రావణ దహనం కూడా చేస్తారు.