
నందిగామ, కొత్తూర్ మండలాల్లో 3.43 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
( పయనించే సూర్యుడు జూలై 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం నందిగామ మండలంలోని మోత్కుల గూడ గ్రామంలో హెచ్ఎండీఏ నిధులు 1.20 కోట్లతో మోత్కుల గూడ గ్రామం నుంచి కేసారం గ్రామం వరకు బీటీ రోడ్డు,శ్రీనివాసుల గూడ గ్రామంలో హెచ్ఎండీఏ నిధులు 58.0 లక్షలతో శ్రీనివాసుల గూడ గ్రామం నుంచి మస్జిద్ మామిడిపల్లి వరకు సీసీ రోడ్డు, బండోని గూడ గ్రామం నుండి బండోనిగూడ తండా వరకు హెచ్ఎండీఏ నిధులు 1.25 కోట్లతో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. ఆ తరువాత కొత్తూరు మండలంలోని తీగాపూర్ గ్రామంలో 20.0 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే డ్వాక్రా భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ మండల అధ్యక్షులు జంగా నర్సింహులు, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ కుమార స్వామి గౌడ్, కొమ్ము కృష్ణ,బండోనిగూడ బుచన్న,నర్సప్ప గూడ మాజీ సర్పంచ్ కృష్ణ,డైరెక్టర్ నర్సింహలు, మల్లేష్,మాజీ ఎంపీటీసీ శేఖర్ గౌడ్,నవాజ్ రెడ్డి,శంకరయ్య, శ్రీశైలం, శివ,నరసింహ, సాములయ్య, మహేందర్,నవీన్ కుమార్ గౌడ్, దర్శన్,రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.

