
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
మానాల మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ గ్రామంలో జరిగిన సంఘటనకు ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ నాపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేయడం జిల్లా ప్రజలు బాల్కొండ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఎదుటివాడిపై దాడులు చేసే ఆలోచన ఉన్న వాడిని కాదు నేను అన్నది నిజమం కదా. గల్ఫ్ బాధితుల విషయంలో ప్రశాంత్ రెడ్డి అన్న మాటలు తప్పు అని వాటినీ సాక్షాలతో రుజువు చేస్తానని చెప్పడం జరిగింది కానీ ప్రశాంత్ రెడ్డి దానిని తప్పుగా నేను దాడికి వస్తున్నట్టు చిత్రీకరించి మాట్లాడడం ఆయన నైతిక విలువలు తగ్గించుకోవడమే. ఇటీవల కేటీఆర్ రేవంత్ రెడ్డి ని ప్రెస్ క్లబ్ కు చర్చకు రమ్మని సవాల్ చేసి అక్కడికి వెళ్లి కూర్చున్న కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకులు గుండాల మాదిరి దాడి చేయలేదని, అందులో మీరు కూడా ఉన్నారని మీకు గుర్తు చేస్తున్నాను. గతంలో కేటీఆర్ హరీష్ రావు ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని అవమానించే ప్రయత్నం చేస్తున్న విధానాన్ని తిప్పి కొట్టడామే నా ప్రయత్నం మాత్రమే మేము చేసింది. ప్రశాంత్ రెడ్డి అన్నట్టు రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం అనుకుంటే ఎందుకు టిఆర్ఎస్ గుండాలతో పత్రిక సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శలు చేయించారు. అదేవిధంగా ఎందుకు మీ తమ్ముడిని ఒక రోజు ముందు మీ ఇంటిలో 30 మంది గంజాయి గుండాలతో దాడికి సిద్ధంకమ్మని ఉంచారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం మీ పైన ఉంది. నిన్న జరిగిన సంఘటనకు పూర్తి బాధ్యత ప్రశాంత్ రెడ్డిది ఎందుకంటే టిఆర్ఎస్ గుండాలను దాడికి పాల్పడే విధంగా ఇంటిలో ఉంచిన వ్యక్తి ప్రశాంత్ రెడ్డి అని అన్నారు. ప్రశాంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ నాకు కొన్ని సూచనలు చేయడం జరిగిందని వాటిని స్వీకరిస్తున్నానని, కానీ ప్రశాంత్ రెడ్డి చెప్పిన 12 మందికి త్వరలోనే గల్ఫ్ బాధిత సహాయం అందుతుందని,ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు దానిపై విచారణ జరిగిన తర్వాతనే ఫలితం వస్తుందని ఆ విషయం ప్రశాంత్ రెడ్డికి తెలవకపోవడం విడ్డూరం అని మానాల మోహన్ రెడ్డి గుర్తు చేశారు. మీరు చెప్పిన 12 మందితో పాటు ఇంకా ఎవరైనా గల్ఫ్ లో ఇబ్బందులు పడ్డ వారు ఉంటే వారికి సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచించే వ్యక్తిని అని రాజకీయాలలో కొందరికి అవకాశాలు రావచ్చు కొందరికి రాకపోవచ్చు కానీ రాజకీయ అనుభవంలో నాకు ప్రశాంత్ రెడ్డి కంటే ఎక్కువ అనుభవం ఉంది ప్రశాంత్ రెడ్డికి అవకాశం వచ్చి ప్రశాంత్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యాడని గుర్తుంచుకోవాలి. మీ తమ్ముడు ఇంకా అధికారం ఉంది అనుకోని చేస్తున్న ఆహంకారపు పనుల వల్ల మీ కార్యకర్తల జీవితాలు కూడా ఇబ్బందులు పడతాయని మీకు తెలియజేస్తున్నాను. అక్రమంగా కేసులు పెట్టడం దాడులు చేయించడం నీకు అలవాటు ప్రశాంత్ రెడ్డి, ఎందుకంటే గతంలో మానాల గ్రామంలో దసరా రోజు లంబాడాలు లంబాడేతర భేదం లేకుండా ఉంటున్న ప్రజల మధ్య లంబాడా పిల్లగాడితో అట్రాసిటీ కేసు పెట్టించిన చరిత్ర నీది. అదేవిధంగా పాలెం గ్రామంలో ప్రవీణ్ అనే రైతును పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి మీ టిఆర్ఎస్ గుండాలు చితిక బాదిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా బాల్కొండ గ్రామంలో మైనారిటీలు రోడ్డు కావాలని వస్తే వారిపైకి కారు ఎక్కించే ప్రయత్నం చేసింది నీవు కాదా. ఎంతో మందిని నీవు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులతో బెదిరించి గుండాగిరి చేసింది ప్రశాంత్ రెడ్డి కాదని ప్రశ్నిస్తున్నాను. నిన్నటి రోజు నంగి దేవేందర్ రెడ్డి దాడికో మీపై దౌర్జన్యం చేయడానికి మీ ఇంటికి రాలేదు ఒకవేళ అలా దాడికి వచ్చేవాడు అయితే ఒంటరిగా వచ్చేవాడు కాదు కేవలం అతను మీరు ఉన్నారు అనుకొని మీకు పేపర్లు ఇచ్చి వెళ్లడానికి వస్తే మీ తమ్ముడు అతని చంపేయండి అంటూ మీ టిఆర్ఎస్ గుండాలను రెచ్చగొట్టి అతనిపై మరియు అతని డ్రైవర్ పై తీవ్రంగా దాడి చేశారు. సాయంత్రం వరకు లేని మీ ఇంట్లో చిందరవందర సాయంత్రం తర్వాత ఎలా వచ్చింది అది కేవలం మీ టిఆర్ఎస్ గుండాలు నిన్న రోజు మొత్తం తాగి చేసిన చిందరవందర మాత్రమే. నేను ఏ రోజు కూడా దాడికి పాల్పడే వాడిని కాదు మీరు ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటాను కానీ ప్రశాంతంగా ఉన్న బాల్కొండ నియోజకవర్గంలో అబద్ధపు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటె ,టిఆర్ఎస్ గుండాలతో ఘర్షణ వాతావరణం సృష్టిస్తే ఉరుకునేది లేదు అని హెచ్చరిస్తున్నాను. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన విధంగా మా రాజ్యాంగం అమలు చేస్తే అధికారులు ప్రతిపక్షాల స్వేచ్ఛను మేము హరిస్తే నిన్నటి రోజు నేను గృహనిర్బంధం అయ్యేవాడిని కాదు అని, మీ తమ్ముడు సంసారానికి పనికి రాకుండా చేసేవాడినని కానీ మేము గాంధీయవాదులమని గాంధీ మార్గంలో నడిచే వాళ్ళం కావున గాంధీ విగ్రహాం దగ్గరికి వచ్చి సమాధానం చెప్పాలని సవాల్ చేశాను తప్ప దాడీకి పాల్పడాలని ఆలోచన లేదు అని, మేము ఎవరిపై దాడి కి వెళ్ళేవాళ్ళం కాదు కానీ మాపై ఎక్కడికి వస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తున్నాను. మూడుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తే ఖచ్చితంగా స్వీకరిస్తామని కానీ అబద్ధపు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే వాడిని అంతేకానీ దాడులకు దిగేవాడిని కాదు అని మరొక్కసారి నాపై ప్రభుత్వానీపై తప్పుడు ఆరోపణలు కోరుకునేది లేదు అని హెచ్చరిస్తున్నాను.