
మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలే దీనికి నిదర్శనం..
మాట నిలబెట్టుకున్న ఏపి.సియం చంద్రబాబు
చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
పైనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 22 రిపోర్టర్ కే శివకృష్ణ
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన కూటమి ప్రభుత్వం.., మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి.., నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్దమైందనీ..ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన పాలనకు నిదర్శనమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ఓ ప్రకటనలో కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా.. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసింది..ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీను నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధిని సోమవారం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు సోమవారం ఓ ప్రకటనలో అభినందినలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఎనలేనిది అన్నారు. మరీ ముఖ్యంగా నిరుపేదలు లేని సమాజ స్థాపనే ఆయన లక్ష్యమని చెప్పారు. అదేసమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టి.., తాజాగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి..,16347 ఉపాద్యాయ ఉద్యోగాల భర్తీకి కంకణం కట్టుకోవడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతకు నిలువెత్తు నిదర్శనం అని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ప్రశంసించారు. ఇకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.., విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు.. ఇందులో కీలక పాత్ర పోషించి.., రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం శుభపరిణామమన్నారాయన. 2047 విజన్ తో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజా దీవెనలు మెండుగా ఉన్నాయన్నారు.