
పయనించే సూర్యుడు // మార్చ్ // 25 // హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిదిలో అంబేద్కర్ నగర్ చెందిన వడ్లూరి పోచయ్య అనే కార్మికుడు ప్రమాదవశాత్తు తన కుడికాలు కోల్పోయారు.ఆలయఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాదె గుణసాగర్ నేత ను సంప్రదించగా ఆలయఫౌండేషన్ మార్గదర్శకులు పరికిపండ్ల నరహరి ఐఏఎస్ అధికారి చొరవతో శ్రీ భగవాన్ మహవీర్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సౌజన్యంతో తనకు జైపూర్ ఫుట్ ను అందించడం జరిగింది. ఇ సందర్బంగా పోచయ్య మాట్లాడుతూ..గత పది సంవత్సరాలుగా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ జిల్లాలో విద్యా వైద్యం మరియు ఉపాధి కార్యక్రమాలను చేస్తున్న, ఆలయ ఫౌండేషన్ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ కీ, మరియు కోఆర్డినేటర్ గాదె గుణసాగర్ కి వడ్లూరి పోచయ్య కృతజ్ఞతలు తెలిపారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వుండి జన్మభూమి పై మమకారంతో సేవ చేయడం సంతోషంగా ఉంది అన్నారు.