
పయనించే సూర్యడు న్యూస్ టెక్కలి ప్రతినిధి జనవరి 21… నందిగాం మండలం మదనాపురం గ్రామానికి చెందిన గుడాపు హేమంత్ కి భరించలేని కడుపు నొప్పి రావడం తో పాత గాజువాక లో వున్న పద్మజ హాస్పిటల్ కి తీసుకువెళ్ళగ పరీక్షించిన వైద్యులు చిన్న ప్రేగు కి ఇన్ఫెక్షన్ అయ్యిందని, సర్జరీ చేయాలన్నారు. ఈ సమస్యకు ఆరోగ్య శ్రీ కూడ వర్తించదని తెలియజేసారు. వీళ్లది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంభం. ఈ విషయం తెలుసుకున్న మదనాపురం శ్రీ చింతపోలమ్మ యువజన సంఘం వాళ్ళు పలువురు దాతల ద్వారా సేకరించిన 25000 రూపాయలు నేడు బాధిత కుటుంభం కు అందజేశారు. ఈ సందర్భంలో సంఘ సభ్యులు ఈ నిరుపేద కుటుంబం కి పలువురు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తారని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ చింతపోలమ్మ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.