
శాలువాతో సత్కరించి స్వాగతం పలికిన వాడ బలిజ సేవసంఘం నాయకులు.
పయనించే సూర్యుడు: మే28; ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
నూగూరువెంకటాపురం: ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం నూతన తహసీల్దార్ గా భాద్యతలు స్వీకరించిన, ఎమ్ వేణుగోపాల్ కి, తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో సాల్వతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం నూతన తహసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ వేణుగోపాల్ కి తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం ఆధ్వరంలో ఘనంగా స్వాగతం పలుకుతూ సాల్వతో సత్కరించి స్వీట్లు పంచిపెట్టారు. రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ వెంకటాపురం మండల కేంద్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నటువంటి వాడబలిజ కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని సంఘ సమస్యలతో ఎప్పుడైనా మీ దృష్టికి వస్తే తమరు పెద్ద మనసు చేసుకొని సమస్యలను పరిష్కరించాలని , తెలియ జేశారు. ఈయొక్క కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జున్ రావు , ములుగు జిల్లా ముఖ్య సలహాదారు బద్ది ఆదినారాయణ, మండల అధ్యక్షులు బొల్లె సునీల్, వాజేడు మండల అధికార ప్రతినిధి బొల్లె ఆదినారాయణ, కార్యదర్శి బోగట విజయబాబు, మల్లికార్జున్, పోతురాజు, వెంకటేష్, సారయ్య, చిట్టిబాబు, కన్నయ్య ,నాగేంద్రబాబు ,శ్రీను, జోగారావు, రమేష్ ,యశ్వంత్, వినయ్, నరసయ్య, జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.
