
. పయనించే సూర్యుడు గాంధారి 03/06/25
గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతనంగా హెచ్.ఇ.సి తెలుగు మీడియం గ్రూప్ మంజూరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం గంగారం తెలిపారు .గతంలో ఎంపీసీ ,బైపిసి ,సిఇసి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం లు ఉండగా కొత్తగా HEC గ్రూపు కూడా మంజూరు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఇకనుంచి కళాశాలలో హెచ్ఈసి గ్రూపులో అడ్మిషన్ పొందగోరే విద్యార్థులు డైరెక్ట్ గా కళాశాల వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ వివరించారు. నూతనంగా హెచ్ఈసి గ్రూప్ మంజూరు చేసినందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య కు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి షేక్ సలంలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.