పయనం చే సూర్యుడు న్యూస్ జనవరి 26 నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండలం గ్రామం. సికింద్రాపూర్ పెద్దమ్మకాడి తాండా గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆవిష్కరించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనల మేరకు రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలొ ప్రజాపాలన నడుస్తుందని, పదేళ్ళ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి నిజమైన స్వాతంత్ర్యం లభించిందన్నారు సకలజనుల హితాన్ని కోరుతూ తెలంగాణలో ప్రగతి పథం వైపు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాప్రభుత్వం నడుస్తుందని ఆయన అన్నారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
నూతన అంబేద్కర్ విగ్రహావిష్కరణ
RELATED ARTICLES