
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి నూతన గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ కి అభినందనలు తెలియజేసిన శేర్లింగంపల్లి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కూన సత్యం గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శిరీష సత్తూర్ మరియు ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా శిరీష సత్తూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీకిగాను జగదీశ్వర్ గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం చాలా సంతోషంగా ఉందని శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి జగదీష్ గౌడ్ చేసే కృషికి ఎల్లప్పుడూ మా మహిళలు తోడుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్, మధు, అనురాధ, గాయత్రి, మణమ్మ, లీల తదితరులు పాల్గొన్నారు.