
నూతన ట్రాన్స్ ఫార్మర్ ను ప్రారంభిస్తున్న దృశ్యం…
రుద్రూర్, మార్చి 21( పయనించే సూర్యుడు,రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ : సమ్మర్ యాక్షన్ లో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయం పక్కన శుక్రవారం నూతన ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈ ముక్తార్ మాట్లాడుతూ.. బోధన్ డివిజన్ పరిధిలో మొత్తం 150 నూతన ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా సబ్ స్టేషన్ లో కూడా నూతన బ్రేకర్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లో వోల్టేజ్ సమస్యలు రాకుండా ఉండడానికి నూతన ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏడి నగేష్ కుమార్, ఏఈ శ్రీనివాస్, సబ్ ఇంజనీర్ నవీన్, గిరిదర్, లైన్ ఇన్ స్పెక్టర్ రాజేశం, లైన్ మెన్ దేశాయ్ శ్రీనివాస్, జేఎల్ ఎం అశోక్, మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్, పత్తి రాము, విద్యుత్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.