
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 18
అల్లూరి సీతారామరాజుల చింతూరు మండలం లోచింతూరు నూతన తాసిల్దార్ని కలిసిన ఆదివాసి జేఏసీ నాయకులు మరియు చింతూరు డివిజన్ ఆదివాసి ప్రెస్ క్లబ్ పాత్రికేయులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, అనంతరం నూతన తాసిల్దార్ గారికి సాలువ తో మరియు ఏజెన్సీ లా పుస్తకం తాసిల్దార్ గారికి బహుకరించడం జరిగింది. అలాగే చింతూరు ఏజెన్సీ గ్రామాల్లో అక్రమ కట్టడాలు తొలగించాలని, ఏజెన్సీ గ్రామాల్లో 1/70 చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, బినామీ పేర్లతో సిమెంట్ ఇటుక బట్టిలను నిర్వహిస్తున్న గిరిజనేతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా తల్లి ఎస్టి తండ్రి గిరిజనేతరాడైనటువంటి వారికీ ఎస్టి సర్టిఫికెట్స్ ఇవ్వరాదని తెలియజేయడం జరిగింది అనేక విషయాలు నూతన తాసిల్దార్ కి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ డివిజన్ డివిజన్ అధ్యక్షులు జల్లి నరేష్ , చింతూరు డివిజన్ ఆదివాసి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాక సీతారామయ్య, ఆదివాసి ప్రెస్ క్లబ్ కోశాధికారి, పూణెం శ్రీను, చింతూరు పెసా కార్యదర్శి కారం సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
