
పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 26:- రిపోర్టర్ (షేక్ కరిముల్లా ) బాపట్ల పట్టణ పురపాలక సంఘంగానికి నూతనంగా కొనుగోలు చేసిన బుల్ కంపెనీ కి చెందిన బుల్ డోజర్ – 1 మరియు 3 ట్రాక్టర్లను బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ:- బాపట్ల పట్టణాన్ని దోమల రహిత మున్సిపాలిటీగా తయారు చేస్తామన్నారు. ప్లాస్టిక్ రహిత బాపట్ల గా తయారు చేసుకోవడానికి ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ వ్యాపారం చేసే వ్యాపారస్తుల ఇక మీద కూడాను ప్లాస్టిక్ అమ్మకాలు చేస్తే సహించేది లేదన్నారు. ఒక సుందర బాపట్ల,ఒక దోమల రహిత బాపట్ల,ఒక ఆహ్లాదకరమైన బాపట్లను తయారు చేసుకోవడానికి ముందుకు వెళతామన్నారు.రాబోయే రోజుల్లో ఒక మంచి బాపట్ల తయారు చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ మునిసిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డి , మునిసిపల్ ఇంజనీర్ కృష్ణారెడ్డి ,తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, మందపాటి ఆంద్రేయ, మరియు తెలుగుదేశం,జనసేన, బిజెపి,నాయకులు,పురపాలక సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.