Sunday, October 19, 2025
HomeUncategorizedనూతన విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన.

నూతన విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన.

Listen to this article

పామ్ ఆయిల్ మొక్కలను నాటండి.
రైతుల కొరకే నూతన విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటు.
బోధన్ నియోజకవర్గంలో 3 విద్యుత్ ఉప కేంద్రాలకు శ్రీకారం.
పార్టీలకు అతీతంగా కలిసి ఉంటూ గ్రామాలను అభివృద్ధి చేసుకోండి.
స్వార్థం కొరకు కోట్లు సంపాదించుకున్నది కేసీఆర్ కుటుంబం.
సీఎం రేవంత్ రెడ్డికి అందరం కృతజ్ఞతలు చెప్పాలి.
మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి.
—- శంకుస్థాపన చేస్తున్న బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి.

—–మాట్లాడుతున్న బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి.

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 27 బోధన్ : సాలూర మండలం జాడి జమాల్ పూర్ గ్రామంలో శుక్రవారం బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి 33/11 కెవి విద్యుత్ నూతన ఉప కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపకేంద్ర నిర్మాణానికి రూ 1 కోటి 92 లక్షల నిధులను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.స్వార్థం కొరకు కోట్లు సంపాదించుకున్నది కేసీఆర్ కుటుంబమని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిస్వార్ధంగా ప్రజలకు పరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.రైతులకు నాణ్యమైన విద్యుత్ సదుపాయాన్ని కల్పించడానికి 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు భరోసా ఇచ్చారు.పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉంటూ గ్రామాలలోని సమస్యలు పరిష్కరించుకొని గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు.రైతులు ఫామాయిల్ మొక్కలు సాగు చేయడానికి ముగ్గు చూపాలని తెలిపారు.పంటల మార్పిడిపై రైతులు దృష్టి పెట్టాలన్నారు.అప్పుడే రైతులు లాభాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు కొరకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చులు చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో 10 శాతానికి పైగా విద్యార్థుల స్టెంత్ పెరిగిందన్నారు.ఉపాధ్యాయులు అందరూ విద్యావంతులేనని విద్యార్థులను కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక కొరత ఉండకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.వ్యవస్థ అంతా నాశనం అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థను సిస్టంలో పెట్టడానికి కృషి చేస్తుందన్నారు.పార్టీలు,కులాలు,మతాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సరైన లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు.ఎవరు గరీబు ఉంటే వారికి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వమంటున్నాము ఇది కాంగ్రెస్ సంస్కృతి అని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాని,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,పిసిసి డెలికేట్ గంగా శంకర్,బోధన్ ఏఎంసీ చైర్మన్ చీల శంకర్,వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి,బోధన్ సాలూర మండలాల అధ్యక్షులు మందర్న రవి,నాగేశ్వరరావు,విద్యుత్ శాఖ డీఈ మహమ్మద్ ముక్తార్,మండల ఎంపీడీవో శ్రీనివాస్,తహసిల్దార్ శశిభూషణ్,సొసైటీ చైర్మన్ లు అల్లె జనార్ధన్,అంతయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి,డిసిసిబి డైరెక్టర్ జి.శరత్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుందర్ రాజు,దేవదానయ్య,జోజయ్య,ప్రకాష్,మాజీ సర్పంచ్ నాని బాబు,ఇల్తెపు శంకర్,అల్లె రమేష్,సంజీవరెడ్డి,దాము,మైదాపు నాగరాజు,డిస్కో సాయిలు,ఖాజాపూర్ అనిల్,అశోక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామ పెద్దలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments