
పయనించే సూర్యుడుజులై 02 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి : సులానగర్ కార్మిల్ మాత ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కి నూతన ప్రధానోపాధ్యాయులుగా సిస్టర్ ఎజిల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న హెచ్ఎం శాంతి కుమారి బదిలీపై వెళ్లగా ఆమె స్థానంలో సిస్టర్ ఎజిల్ వచ్చారు. సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధిలో, పిల్లలు చదువులో నైపుణ్యతను పెంచుతామని క్రమశిక్షణతో కలిగిన విద్య బోధన జరుగుతుంది కనుక ఎల్ కేజీ నుంచి 9వ.తరగతి వరకు మా పాఠశాలలో ఆంగ్ల భాషలో అడ్మిషన్లు జరుగుచున్నాయని. సీనియార్టీ కలిగిన ఉపాధ్యాయులచే విద్య బోధన జరుగుతుందని, మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలియజేశారు. అనంతరం నూతన బాధ్యతలు స్వీకరించిన హెచ్ఎం కి తోటి సిబ్బంది పుష్పగుచుమిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.