Saturday, June 7, 2025
Homeతెలంగాణనెలాఖరుకే నోటిఫికేషన్‌. స్థానిక ఎన్నికలపై సర్కారు ముందుకే

నెలాఖరుకే నోటిఫికేషన్‌. స్థానిక ఎన్నికలపై సర్కారు ముందుకే

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి :పదిహెను వ తేదీన మరోసారి క్యాబినెట్‌ భేటీ అప్పుడు దీనిపై పూర్తిస్థాయిలో నిర్ణయం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఖాయమైందా?పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈ నెలాఖరులోపు ఎన్నికల ప్రకటన కూడా జారీ కానుందా? విశ్వసనీయవర్గాలు ఈప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి. గురువారంనాడు భేటీ అయిన రాష్ట్ర మంత్రి వర్గం ఉద్యోగుల డిమాండ్లు, మెట్రో విస్తరణ, రహదారుల అభివృద్ధి సహా మొత్తం 56 కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది.స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల పది హేను న మరోసారి సమావేశం కానున్నటు.. అప్పుడు పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్‌ పార్టీ జోరు పెంచింది. అందులో భాగంగా.. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం.. వారికి నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోయే యోచనలో అధికార పార్టీ ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments