
ఆదర్శ పాఠశాల ఫోటో…
రుద్రూర్, మార్చ్ 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నతపాఠశాల, అంబం గ్రామ శివారులోని ఆదర్శ పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, శుక్రవారం మార్చి 20 వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు గాలి, వెలుగు స్పష్టంగా వచ్చేటట్లు, విద్యార్థులకు పరీక్ష రాసేందుకు అనువుగా ఉండేందుకు డ్యూయల్ డెస్క్ టేబుల్ లతో పరీక్ష కేంద్రాలను సిద్ధం చేయడం జరిగిందని ఈనెల 20వ తేదీ నుండి ఏప్రిల్ 04వ తేదీ వరకు ఉదయం 9:30ల నుండి మధ్యాహ్నం 12:30 వరకుపరీక్షలు జరుగుతాయని అన్నారు. రుద్రూర్ మండలంలో 5 ఉన్నత పాఠశాలలకు గాను రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 148 మంది, అంబం శివారు లోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో 240 మంది రెండు కేంద్రాలలలో మొత్తం 388 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అయన తెలిపారు. సిసి కెమెరాల పర్యవేక్షణలో ప్రశ్న పత్రాలను తెరవడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని మండల విద్యాధికారి శ్రీనివాస్ కోరారు. పరీక్ష కేంద్రాల పరీక్ష జరుగుతున్న సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రుద్రూర్ ఎస్సై సాయన్న తెలియజేశారు.