
పయనించే సూర్యుడు మార్చి 13 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్,తో బేటి కానున్నారు ఇందుకోసం బుధవారం సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లారు. జై శంకర్ తో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడ కూడా పాల్గొనట్లు తెలిసింది.
అయితే ప్రస్తుతం జైశంకర్ విదేశీ పర్యటనలో ఉండగా.. బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకుంటారని సమాచారం. కాగా వీరి ఇరువురి భేటీపై స్పష్టత రానుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆకస్మిక పర్యటన వెనుక గల కారణం ఏమిటంటే.. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం చర్చించేం దుకు విదేశాంగశాఖ మంత్రితో సీఎం సమావేశం అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో పలువురు కీలక నిందితులు విదేశాల్లో తలదాచుకుంటుండగా.. వారిని ఎలాగైనా స్వదే శానికి రప్పించి, శిక్ష పడేట్లు చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. రాష్ట్రానికి సంబంధించి
వీటితోపాటు విదేశీ వ్యవహారాల శాఖతో ముడిపడిన వ్యవహారాలు చర్చించనున్నట్లు తెలిసింది