
పయనించే సూర్యుడు ఏప్రిల్ 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
వరుస ఎన్ కౌంటర్లతో ఛత్తీస్‌గఢ్, దద్దరిలుతున్న వేళ..ఇవ్వాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బస్తర్ పర్యటనకు సిద్ధమయ్యారు .
ఛత్తీస్‌గఢ్ లో బస్తర్ రీజి యన్ లోని దంతె వాడలో అమిత్ షా పర్యటనకు సర్వం సిద్ధం అయింది. ఈరోజు దంతెవాడకు చేరుకొని, అక్కడ గల దంతేశ్వరి అమ్మవారిని అమిత్ దర్శించుకుంటారు. అనంతరం నక్సల్స్ నిరోధక ఆపరేషన్స్ లో పాల్గొంటున్న భద్రతా బలగాల కమాం డర్లతో ఆయన భేటీ కానున్నారు.
ఆపరేషన్ కగర్ ను మరింత ఉధృతం చేసేందుకు వారికి దిశా నిర్దేశం చేయనున్నా రు. అదేవిధంగా ఆపరేషన్స్ లో పాల్గొంటున్న భద్రతా బలగాలను నేరుగా కలిసి వారిలో స్థైర్యాన్ని నింపనున్నారు. ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్ లో జరుగుతున్న ఎన్కౌంట ర్లలో పెద్ద సంఖ్యలో మావో యిస్టులు మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్ షా బస్తర్ పర్యటనప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఆపరేషన్ కగర్ పేరుతో వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటొ నాటికి దేశంలో మావోయిస్టులను ఏరి పారేస్తామని అమిత్ షా ప్రకటించారు. గత ఏడాది మొదలైన ఆపరేషన్ కగర్ లో ఇప్పటి వరకు భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. అలాగే భారీ సంఖ్యలో మావోయి స్టులు లొంగిపోయారు.