
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గం.
గంపలగుడెం మండలం నెమలి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీవేణుగోపాల స్వామి వారి ఆలయ కమిటీ చైర్మన్ కావూరి శశిరేఖ విలేఖరుల సమావేశం. పయనించే సూర్యుడు మార్చి 16 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. ఆలయ ఈవో ఎన్.సంద్య వ్యవహార శైలిపై మండిపడ్డ ఛైర్మన్. తనకున్న ఆలయ కమిటీ చైర్మన్ హోదాను అవమాన పరుస్తున్న ఈవో నేడు శ్రీ వేణుగోపాలుడి కల్యాణానికి కనీసం భక్తులకు సైతం పాసులు కూడా ఇవ్వలేదు.తన అనుయాయులకు మాత్రమే ఇచ్చిన వీఐపీ పాసులు ఈఓ ప్రవర్తనపై దేవాదాయ కమిషనర్ కు ఇప్పటికే ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదు.ఈవో తీరుపై హైకోర్టును ఆశ్రయించాం, పాలకపక్ష సభ్యులను కలుపుకొని వెళ్లాలని ఆదేశించిన హైకోర్టు. హైకోర్టు ఉత్తర్వులను సైతం ధిక్కరిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనిచేస్తున్న ఈఓ. వెంటనే ఈవో పై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నాం.