
( పయనించే సూర్యుడు జూలై 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
వైఎంకె అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలొ విజయవాడ పట్టణంలోని గుజ్జల సరళ దేవి ఫంక్షన్ హాల్ లో నేషనల్ స్టార్స్ ఎక్సలెన్స్ అవార్డు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ అవార్డు ఫంక్షన్ లో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లోని న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ ను వైఎంకె అకాడమీ మాస్టర్ రూపస్ పాల్,సినీ హీరో భానుచందర్ చేతుల మీదుగా శాలువాలతో సన్మానం చేసి సర్టిఫికెట్ మరియు మెడల్ అందజేశారు. ఈ సందర్భంగా మాస్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ కాలనుగుణంగా దేశం లో రోజు రోజుకు ఆడవాళ్లు, పిల్లలపై అసాంగిక చర్యలు పెరుగుతున్న సందర్బంగా ప్రతి ఒక్కరు తమ ప్రాణ రక్షణ కొరకు కుంగ్ ఫు, కరాటే వంటి విద్యను కచ్చితంగా నేర్చుకోవాలని ఆయన సూచించారు. కుంగ్ ఫు, కరాటే తో సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు మెదడు శక్తి ని, శరీరాన్ని ఆరోగ్య కరంగా ఉంటుందని అన్నారు. తనకు ఈ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మాస్టర్ అహ్మద్ ఖాన్ కు అవార్డు దక్కడంతో షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
