
జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా షోటో ఖాన్ మాస్టర్ చేగూరి శివక్రిష్ణ గౌడ్
(లోకల్ గైడ్ షాద్ నగర్)
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల్ తిమ్మాపూర్ వై ఎం సి ఏ అకాడమీ అధ్యర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ని విజయవాడ పట్టణం లో ఈ నెల 20 వ తారీకు జరగనున్న నేషనల్ స్టార్ ఎక్సెలెన్స్ అవార్డ్స్ కు రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా షోటో ఖాన్ యంగ్ అండ్ డైనమిక్ మాస్టర్ చేగూరి శివక్రిష్ణ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా మాస్టర్ చేగూరి శివక్రిష్ణగౌడ్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి కరాటేలో ఎంతోమంది బాలికలకు ఉచిత కరాటేలో శిక్షణ ఇస్తూ అంచెలు అంచెలుగా ఎదిగి సమాజంలో తన వంతు సహాయ సహకారలు అందరికీ అందిస్తున్నాను అని అన్నారు. నేషనల్ స్టార్ ఎక్సెలెన్స్ అవార్డు కు నన్ను ఎన్నుకున్నందుకు వై ఎం సి ఏ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 20 వ తేదిన విజయవాడ లోని గజ్జల సరోజినీ దేవి ఫంక్షన్ హల్ లో సినీ హీరో భాను చందర్ చేతులమీదుగా ఈ అవార్డ్స్ అందజేస్తున్నారని తెలిపారు.
