
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 26 తెలంగాణ సేటించారి శ్రీనివాస్ రెడ్డి
కూకట్ పల్లి బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, న్యాయవాది తన్నీరు శ్రీకాంత్ ఫై అమానుషంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ డిమాండ్ చేశారు. ఒక కేసులో కోర్టు ఉత్తర్వులను అమలుపరిచే పనిలో భాగంగా వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి బేలీఫ్ తో వెళ్లిన శ్రీకాంత్ పై ప్రత్యర్ధులు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు, అతని ఎడమ చేతికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినవి. కావున దాడి చేసిన దుండుగలను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.