
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు స్టేట్ లెవెల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ 2025 ఛాంపియన్షిప్ షాద్నగర్ లో జరిగిన పోటీలలో నంది అవార్డు గ్రహీత అహ్మద్ ఖాన్ (బ్రూస్లీ )మాస్టర్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి ఛాంపియన్షిప్ మరియు మెడల్స్ సాధించారు. మొదటి స్థానంలో గోల్డ్ మెడల్ గెలిచిన విద్యార్థులు చైతన్,రాహుల్,అజ్మ,ప్రేమ్ కుమార్, రక్షిత్,నిత్విక్,జునైనా, సాత్విక్,ఫుర్ఖాన్,సాత్విక్, శశాంత్, చరణ్ తేజ, రెండో స్థానంలో దీక్షిత, గీతిక, అప్సర కైవసం చేసుకున్నారు.ఈ సందర్బంగా మాస్టర్లకు విద్యార్థిని, విద్యార్థులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ కనకం యాదవ్, బాలరాజ్ మాస్టర్, సీనియర్ కరాటే మాస్టర్ నరేందర్ నాయక్, నంది అవార్డు గ్రహీత అహ్మద్ ఖాన్ మాస్టర్( బ్రూస్ లీ) విద్యార్థినీ,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
