
పాల్గొన్న కుంగ్ ఫు విద్యార్థినీ విద్యార్థులు
పండుగ విశిష్టతను వివరించిన మాస్టర్ రమేష్
( పయనించే సూర్యుడు ఆగస్టు 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ గ్రౌండ్ లో న్యూ మాంక్స్ కుంగ్ పూ ఉచిత ట్రైనింగ్ క్యాంప్ లో ఈరోజు రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కరాటే విద్యార్థిని విద్యార్థులుఅందరూ రాఖి పండుగ సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా కుంగ్ పూ విద్యార్థిని విద్యార్థులు ఒకరినొకరు రాఖీలు కట్టుకొని ఘనంగా పండుగను జరుపుకున్నారు. అనంతరం కుంగ్ ఫు అబ్బాయిలకు రాఖి కట్టి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం మాస్టర్ కొందుర్గు రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు రాఖీ పండుగ యొక్క విశిష్టతను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెల్త్ ఇండియా, ఇండియా ఫౌండర్ గుంటి నరేందర్ మరియు కారుకొండ మహేందర్ విద్యార్థుల తల్లితండ్రులు మరియు కరాటే మాస్టర్ రమేష్ మరియు వారి శిష్యులు పాల్గొన్నారు.
