
బోధన్ టౌన్ సిఐ వెంకట్ నారాయణ
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 21 నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో రానున్న పండుగలను శాంతియుత వాతావరణం లో ఘనంగా జరుపుకోవాలని బోధన్ టౌన్ సిఐ వెంకట్ నారాయణ కోరారు పట్టణ ప్రజలకు అధికారులకు అనధికారులకు ప్రజాప్రతినిధులకు పార్టీ నాయకులకు మహిళలకు యువకులకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు. పండుగలను కులాలకు మతాలకు అతీతంగా సోదర భావంతో ఒకరికి ఒకరు సహాయ సహకారం అందించుకుంటూ స్నేహ భావంతో పండుగలు జరుపుకుంటే సంతోషకరమైన వాతావరణం ఉంటుందని బోధన్ పట్టణంలో ఎక్కడ లేని విధంగా సంతోషకరమైన వాతావరణంలో కులాలు మతాలు తేడా లేకుండా సహాయ సహకారాలు అందించుకుంటూ పండుగలు జరుపుకోవాలని పోలీస్ సిబ్బందికి ప్రజలు భక్తులు సహకరిస్తూ పండగ నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు దేవిమాత మండప నిర్వాహకులకు పోలీస్ శాఖ ఆదేశాల మేరకు నియమ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు మండపాల వద్ద సౌకర్యాలు ఏర్పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలని ఎలాంటి సమస్యలున్న బోధన్ పట్టణ పోలీస్ శాఖకు తక్షణమే సమాచారం అందించాలని కోరారు.