
// పయనించే సూర్యుడు// సెప్టెంబర్5//మక్తల్
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో గత కొన్ని నెలలుగా పగటిపూట కూడా వీధిలైట్లు వెలుగుతున్న సదరు అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. నెలల తరబడి పగటిపూట లైట్ వెలుగుతున్న అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత మున్సిపాలి అధికారులకు విషయం తెలుపగా థర్డ్ వైర్ సమస్య ఉందని… సమస్యను పరిష్కరించమంటే అప్పుడు ఇప్పుడు అంటూ దాటవేస్తున్నారని , దీంతో ఎంతో ప్రజాధనం వృధా అవుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.