
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 2(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలంలో పాస్టర్స్ మరియు సంఘ సభ్యులు ఆధ్వర్యంలో రెవరెండ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అకాల మరణానికి సంతాపముగా మండలంలో శాంతి ర్యాలీ స్థానిక పాత పోలీస్ స్టేషన్ దగ్గర నుండి బైబిల్ మిషన్ చర్చి వరకు భారీ ఎత్తున క్రైస్తవులంతా ఐక్యత కలిగి ప్రార్థనలతో ప్రారంభించి కొంతమంది సేవకుల ద్వారా సందేశాన్ని అందించి పగడాల ప్రవీణ్ భార్య పిల్లల వారి కుటుంబము నిమిత్తమై కొంతమంది పాస్టర్లు ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. చివరిగా ప్రార్థన ఆశీర్వాదాలతో శాంతి ర్యాలీని ముగించారు యాడికి పాస్టర్స్ రెవరెండ్ బి సోలోమోన్, జాన్ సుధాకర్, రంగారావు, మత్తయ్య, జాన్ మోసే, పౌలు, సుధాకర్, ఏసన్న, అనిల్ జాషువా, చార్లెస్, బెన్నయ్య, పౌలు, ఫిలిప్పు, ప్రవీణ్ కుమార్, సుధాకర్, ఈటె ప్రసాద్ యాడికి లోని క్రైస్తవులందరూ భారీ ఎత్తున శాంతి ర్యాలీలో పాల్గొని ఘన నివాళి అర్పించి తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు.
